Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్సీ అనంత బాబు సెంట్రల్ జైలుకు తరలింపు

ఎమ్మెల్సీ అనంత బాబు సెంట్రల్ జైలుకు తరలింపు

వార్త 3 months ago

Anantha Babu Case: దళిత యువకుడు, కారు డ్రైవర్ హత్యకేసులో నిందితుడు, ఎమ్మెల్సీ అనంత బాబు పోలీసు కస్టడీ ముగిసింది. కారు డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్యకేసు ప్రలోభ పెట్టిన కేసులో ఒక్కరోజు పోలీస్ కస్టడీ నుండి ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు వైద్య పరీక్షలకు నిమిత్తం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు.

పోలీస్ కస్టడీలో పోలీసులు ఎన్నిసార్లు అడిగినా తనకేమీ తెలియదంటూ సరైన సమాదానాలు చెప్పలేదని తెలిసింది.

Read also: Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య?

 MLC Anantha Babu taken to Central Jail

Anantha Babu Case: విచారణలో నోరు విప్పని ఎమ్మెల్సీ

సుమారు 50 ప్రశ్నలు పోలీసులు అడిగినా నాకు తెలియదు, గుర్తు లేదు అని అనంతబాబు పోలీసు విచారణలో ఇచ్చిన సమాధానం. దీంతో మరోమారు పోలీసు కస్టిడీకి కోరాలని బావిస్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయం ముగియడంతో వైద్య పరీక్షలు అనంతరం కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపర్చి అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కి ఎమ్మెల్సీ అనంతబాబును తరలించారు. రాత్రి 11 గంటల. వరకు కొనసాగిన విచారణలో కేసు దర్యాప్తు అధికారి తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తో పాటు ఇద్దరు సిఐలు ఇతర పోలీసు సిబ్బంది విచారణలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కోదాడలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha