కోదాడలో భార్య హత్య కలకలం
Kodad Murder Case : కోదాడ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.
బుధవారం రాత్రి కోదాడ బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబునగర్‌కు చెందిన మణిదీప్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు జగ్గయ్యపేటకు చెందిన శిరీష (24)ను ప్రేమించి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
కుటుంబ కలహాలే కారణం
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన గొడవ నేపథ్యంలో శిరీష, ఆమె పెద్దమ్మ, మణిదీప్ కలిసి కోదాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్దిచెప్పి పంపించారు. అయితే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఘోరం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట వెళ్లేందుకు శిరీష ఆటో ఎక్కగా, మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగాడు.
Read Also:SBI : సమ్మె బాట పట్టబోతున్న SBI ఉద్యోగులు !!
Kodad Murder Caseటీ స్టాల్ వరకు వెంటాడి దాడి
ప్రాణభయంతో శిరీష సమీపంలోని టీ స్టాల్‌లోకి పరుగెత్తింది. అయినప్పటికీ మణిదీప్ కత్తితో వెంటాడి విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడు మణిదీప్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై సీఐ శివశంకర్ వివరాలు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

