Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత!

ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత!

వార్త 21 hrs ago

Umashankar Singh: ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)కి తీరని లోటు వాటిల్లింది. అసెంబ్లీలో బీఎస్పీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ (Umashankar Singh) బుధవారం రాత్రి కన్నుమూశారు.

కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Read Also :Riya Ahir: ట్రోలింగ్ పేరుతో వేధింపులు.. కఠిన చర్యలు కోరిన రియా అహిర్

Umashankar Singh: ఉమాశంకర్ సింగ్ ప్రస్థానం - ప్రధాన విశేషాలు

ఉత్తరప్రదేశ్‌లోని రస్దా (Rasra) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమాశంకర్ సింగ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత యూపీ శాసనసభలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఏకైక శాసనసభ్యుడు ఆయనే కావడం గమనార్హం. విద్యార్థి నాయకుడిగా (Student Leader) తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, క్షేత్రస్థాయి ప్రజానాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.

అభిజీత్, సౌరవ్ పై పోక్సో కేసు పెట్టాలని ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha