Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీ బైరెడ్డి శబరి పీఏ మృతి!

ఎంపీ బైరెడ్డి శబరి పీఏ మృతి!

వార్త 2 months ago

MP Byreddy Shabari: నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి వ్యక్తిగత సహాయకుడు (PA) రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంపీ శబరి, తన పనులన్నింటినీ రద్దు చేసుకుని తక్షణమే కర్నూలుకు చేరుకున్నారు.

రాజేష్ నాయుడు భౌతికకాయాన్ని చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Read Also: Kalvakuntla kavitha: అసమానతలు లేని సమాజమే బాబాసాహెబ్ ఆశయం.. కవిత

కుటుంబ సభ్యుడిని కోల్పోయాను: ఎంపీ శబరి

రాజేష్ నాయుడు కేవలం సహాయకుడు మాత్రమే కాదని, గత 20 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబంతో కలిసి పనిచేస్తూ ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయారని ఎంపీ శబరి గుర్తు చేసుకున్నారు. రాజేష్ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైన ఆమె, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కష్టకాలంలో రాజేష్ నాయుడు కుటుంబానికి బైరెడ్డి కుటుంబం పూర్తి అండగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.

MP Byreddy Shabari: తీవ్ర విషాదంలో అనుచరులు

రాజేష్ నాయుడు మృతి పట్ల బైరెడ్డి అనుచరులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా బైరెడ్డి కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ, నియోజకవర్గ పనుల్లో కీలక పాత్ర పోషించిన రాజేష్ మరణం తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎంపీ శబరి స్వయంగా హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది.

Read Also hindi news: https://hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సోషల్ మీడియా ట్రోలింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha