మరోసారి ఎగ్జిబిటర్ల అల్టిమేటం
Theaters Strike in Telangana: రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని, లేదంటే మే 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మరోసారి అల్టిమేటం ఇచ్చారు.
ప్రస్తుతం రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్సుల్లో అమలు చేస్తున్నట్లే తమకూ పర్సంటేజీ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా హైదరాబాద్లోని 23 థియేటర్లలో పర్సెంటేజీ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఎగ్జిబిటర్ల సంఘం అమలు చేస్తోంది.
Read Also : Jobs : అంగన్వాడీల్లో జాబ్స్ - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Theaters will be closed from May 1st.
Theaters Strike in Telangana: పర్సంటేజీ విధానం, నిర్వహణ భారం
ఈ ప్రతిపాదన ప్రకారం సినిమా విడుదలైన తొలి వారం వసూళ్లు అయిన ఆదాయంలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం చొప్పున థియేటర్లకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం థియేటర్లకు ఉన్న ఫిక్స్డ్ అద్దె విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే తీవ్రంగా నష్టపోతున్నాయని ఎగ్జిబిటర్లు అంటున్నారు. పెద్ద సినిమాలు ఆడినా, ఆడకపోయినా నిర్వహణ ఖర్చులు భారం అవుతున్నాయని, అందుకే మల్టీప్లెక్స్ తరహా షేరింగ్ పద్ధతే మంచిదని తేల్చిచెబుతున్నారు. ఎగ్జిబిటర్లు చేసిన పర్సంటేజ్ప్ర తిపాదనలను ప్రొడ్యూసర్స్ గిల్డ్ ససేమిరా అంటోంది. థియేటర్లకు భారీగా పర్సెంటేజీలు ఇవ్వడం కుదరదని, ఇది నిర్మాతలపై అదనపు భారం మోపడమేనని నిర్మాతల గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

