Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న బీర్లు

రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న బీర్లు

వార్త 1 month ago

Telangana Liquor Sales: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవు తుండడంతో రాష్ట్రంలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

బీర్ల ధరలు పెరిగినప్పటికీ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు మందు బాబులు చల్లని బీర్లను తెగ తాగేసుండడంతో బీర్ అమ్మకాలుభారీగా పెరిగిపోతున్నాయి.

ఫలితంగా బీర్ల విక్రయాలు రికార్డు సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సమ్మర్లో లో బీర్ల సేల్స్ భారీగా పెరిగినట్లు ఎక్సైజ్శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, బీర్ల విక్రయాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రానున్న డిమాండ్ను అంచనా వేసిన బీర్ల ఉత్పతినత కంపెనీలు కొరత రాకుండా ఉత్పత్తిని పెంచుతున్నాయి.

Read Also : Theaters Strike in Telangana: మే 1 నుంచి థియేటర్ల మూసివేత

 Beers are selling at record levels in Telangana

Telangana Liquor Sales: గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి

ఈ ఏడాది మార్చిలో బీర్ల విక్రయాలు ఏకంగా 50.78 లక్షల కేసులకు చేరుకున్నాయి. గత ఏడాది మార్చిలో 39.05 లక్షల కేసులు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో ఏకంగా 30 శాతం వృద్ధి చెందాయి. బీర్ల అమ్మకాలు పెరగడంతో ఎక్సైజ్శాఖకు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అటు ఐఎంఎఫ్ఎల్ మద్యం విక్రయాలు 2.5 శాతం తగ్గాయి.

అయితే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సేల్స్ మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది మార్చిలో 31.46 లక్షల కేసులు అమ్ముడుపోగా ఈ సారి 30.67 లక్షల కేసులకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2.5 శాతం తగ్గుదల నమోదైందని తెలుస్తోంది. మార్చిలో రూ.3,485 కోట్ల ఆదాయం మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రాగా గత ఏడాది రూ.3126 కోట్ల ఆదాయం వచ్చింది. ఏకంగా 11.49 శాతం వృద్ధి నమోదైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సిమ్ పోర్ట్ చేయించుకుంటే పెట్రోల్ ఫ్రీ..ఎక్కడో తెలుసా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha