Dragon movie : గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon) పై టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం మొదలైంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు సంబంధించి ప్రశాంత్ నీల్ లీక్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చూసి అభిమానులు మైండ్ బ్లాక్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నది ఒక పక్కా హీరో పాత్ర కాదని, పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని తేలిపోయింది.
మూడు సంవత్సరాల కష్టం.. 'ల్యూజర్'గా తారక్!
ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు రాసిన కథలు, క్యారెక్టర్లలోకెల్లా తారక్ పాత్ర అత్యంత డార్క్‌గా, కంప్లీట్ నెగిటివ్ షేడ్‌లో ఉంటుంది. ఈ ఒక్క క్యారెక్టర్‌ను పక్కాగా డిజైన్ చేయడానికే నాకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టింది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు "ల్యూజర్" (LUGER) అని ఇండస్ట్రీ వర్గాల టాక్. గతంలో కొన్ని చిత్రాల్లో గ్రే షేడ్స్ లో కనిపించిన తారక్.. కెరీర్‌లో మొదటిసారి అవుట్ అండ్ అవుట్ డార్క్ విలనిజం రోల్ చేయబోతుండటం ఇదే తొలిసారి.
Read Also : ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన 'కరుప్పు' టీమ్
Dragon movieరెండు భాగాలుగా.. 2027 జూన్ లో విద్వంసం!
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే.. షూటింగ్ దశలోనే ఓవర్సీస్ (విదేశీ) హక్కులు కళ్లు చెదిరే భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఫస్ట్ పార్ట్‌ను 2027 జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

