Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

వార్త 2 weeks ago

NTR Jayanthi: తెలుగుజాతి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు గురువారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు.

 NTR Jayanthi

ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న ఆయన మనవడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి భావోద్వేగంతో అంజలి ఘటించారు. తారక్ రాకను గమనించిన అభిమానులు, నందమూరి కేడర్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని 'జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్' అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. జనసందోహం ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read also: Abyom SpaceTech and Defence: రీయూజబుల్ రాకెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం

NTR Jayanthi: మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం.. హామీ నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట మైత్రీవనం జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈరోజు అధికారికంగా ఆవిష్కరించనున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సమయంలో నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విగ్రహావిష్కరణ మహోత్సవం నేపథ్యంలో అమీర్‌పేట, మైత్రీవనం పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఈ చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలోనూ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్మరించుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్నగారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha