Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ ప్రత్యేకమైన పోస్ట్.. తన కొత్త స్నేహితులు అంటూ పరిచయం..

ఎన్టీఆర్ ప్రత్యేకమైన పోస్ట్.. తన కొత్త స్నేహితులు అంటూ పరిచయం..

వార్త 4 days ago

Jr NTR new pet birds: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక సరికొత్త, ప్రత్యేకమైన కానుకను అందించారు. తారక్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక క్యూట్ సర్ప్రైజ్‌ను షేర్ చేశారు.

తన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరిన ఇద్దరు బుజ్జి స్నేహితులను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు పరిచయం చేశారు. అవి మరేదో కాదు.. రెండు అందమైన పెంపుడు పక్షులు. వాటికి ఆయన 'అసాహి', 'యూహీ' అని నామకరణం చేశారు. ఈ విచిత్రమైన పేర్లు జపాన్ దేశంపై, అక్కడి సంస్కృతిపై తనకున్న అమితమైన ప్రేమకు ప్రతిబింబం అని తారక్ తన పోస్ట్‌లో ఎంతో ఆనందంగా పేర్కొన్నారు.

Read Also : Khushbu tweet to NTR: లవ్ యూ కన్నా.. నా డ్రాగన్.. ఎన్టీఆర్‌కు ఖుష్బూ బర్త్‌డే విషెస్

Jr NTR new pet birds: జపాన్ టూర్ జ్ఞాపకాలు..

తన భారీ పాన్ ఇండియా చిత్రం 'దేవర పార్ట్ 1' ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్‌లో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పర్యటన సమయంలో అక్కడి జపనీస్ అభిమానులు చూపిన ఆదరణకు, ప్రేమకు ఆయన పూర్తిగా ఫిదా అయ్యారు. ముఖ్యంగా, తాము నటించిన 'ఆర్ఆర్ఆర్‌' సినిమా చూసి స్ఫూర్తి పొంది, ఒక జపాన్ అభిమాని ఏకంగా తెలుగు భాషను నేర్చుకున్నారని తెలిసి ఎంతో కదిలిపోయానని అప్పట్లో తారక్ ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్‌' చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద అంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దేశంతో ఉన్న అనుబంధం వల్లే తన పక్షులకు జపనీస్ పేర్లు పెట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

NTR మాస్ లుక్‌కు బాక్సాఫీస్ షేక్.. రికార్డులు బద్దలే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha