Public Talk on Dragon Glimpse: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇటీవల విడుదలైన ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో, నందమూరి అభిమానుల ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్‌పైనే నిలిచాయి. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 19 అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేసిన ‘డ్రాగన్’ గ్లింప్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ విజువల్ వండర్‌పై ప్రేక్షకులు, అభిమానుల నుంచి వస్తున్న పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Read Also:Khushbu tweet to NTR: లవ్ యూ కన్నా.. నా డ్రాగన్.. ఎన్టీఆర్‌కు ఖుష్బూ బర్త్‌డే విషెస్
“మాస్ అమ్మ మొగుడు”.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న తారక్ ఆరా
A powerful dark-themed silhouette poster of Man of Masses NTR from the Dragon movie glimps
గ్లింప్స్ చూసిన అభిమానులు థియేటర్లలో చొక్కాలు చించుకోవడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలను మించి ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారని ఖుషీ అవుతున్నారు. “ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకే మాస్ మొగుడు.. ఇకపై ఇండియా మొత్తానికి మాస్ మొగుడు” అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గ్లింప్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), టైగర్‌లా నడిచి వచ్చే స్వాగ్ మరియు పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Public Talk on Dragon Glimpse: హీరోయిన్ రుక్మిణీ వసంత్ గ్లామర్.. రెండు భాగాలుగా ‘డ్రాగన్’?
ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ డెడ్లీ లుక్‌తో పాటు కథానాయిక రుక్మిణీ వసంత్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరియు థియేటర్లలో ఈలలు వేయించే డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్లింప్స్‌లో ‘విలన్స్ ఆఫ్ ఆఫ్గన్ ట్రేడింగ్ కంపెనీ’ని చూపించి, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’ని దాచడాన్ని బట్టి చూస్తే.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా (Two Parts) ప్లాన్ చేస్తున్నారా? అనే ఆసక్తికర చర్చ ఫ్యాన్స్‌లో మొదలైంది.
రొటీన్ మేకింగ్ అనే విమర్శలు.. కానీ అంచనాలు మాత్రం పీక్స్!
మరోవైపు, ఈ గ్లింప్స్ కొంత రొటీన్‌గా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విజువల్స్ మరియు కొన్ని షాట్స్ ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన సలార్, కేజీఎఫ్‌లను గుర్తుచేస్తున్నాయని కొందరు సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఇందులోని ఓపియమ్ ట్రేడింగ్ బ్యాక్‌డ్రాప్, కాస్టింగ్, అద్భుతమైన షాట్ మేకింగ్ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. మొత్తానికి షూటింగ్ దశలో ఉన్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌తోనే సంచలనం సృష్టిస్తూ, ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా మొదటి అడుగును దిగ్విజయంగా పూర్తి చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
హ్యాపీ బర్త్‌డే బావా.. ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ క్రేజీ బర్త్‌డే విషెస్!

