Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లవ్ యూ కన్నా.. నా డ్రాగన్.. ఎన్టీఆర్‌కు ఖుష్బూ బర్త్‌డే విషెస్

లవ్ యూ కన్నా.. నా డ్రాగన్.. ఎన్టీఆర్‌కు ఖుష్బూ బర్త్‌డే విషెస్

వార్త 5 days ago

Khushbu tweet to NTR: టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్బంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచే కాకుండా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుండి కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ సుందర్.. తారక్‌పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని, స్నేహాన్ని చాటుకుంటూ చేసిన ట్వీట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Also : Jr NTR Birthday Celebrations: తారక్ బర్త్‌డే వేడుకలు.. అంబరాన్నంటిన హంగామా

Khushbu tweet to NTR: లవ్ యూ కన్నా.. అంటూ ఖుష్బూ భావోద్వేగ పోస్ట్

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. "నా ప్రియమైన, నాకు అత్యంత ఇష్టమైన తారక్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అపారమైన సంతోషం, అద్భుతమైన విజయం, నిండు నూరేళ్ల మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక. లవ్ యూ కన్నా, నా హీరో, నా తారక్, నా డ్రాగన్" అంటూ ఆమె తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో రాసుకొచ్చారు.

ఎన్టీఆర్ నటిస్తున్నకొత్త క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డ్రాగన్' సినిమాను ఉద్దేశిస్తూ ఖుష్బూ 'నా డ్రాగన్' అని సంబోధించడం నందమూరి అభిమానులను తెగ ఖుషీ చేస్తోంది. ఎన్టీఆర్‌ను ఎంతగానో అభిమానించే ఖుష్బూ.. ఆయనను ఎంతో ఆప్యాయంగా 'కన్నా' అని పిలవడం వారి మధ్య ఉన్న మధురమైన బంధాన్ని తెలియజేస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వస్తున్న వరుస అప్‌డేట్లతో అభిమానుల పండగ వాతావరణం అంబరాన్ని తాకుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హ్యాపీ బర్త్‌డే బావా.. ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ క్రేజీ బర్త్‌డే విషెస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha