Maa Inti Bangaram Collections: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.
టాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఈ చిత్రం ఉత్తర అమెరికా (North America) మార్కెట్లో అరుదైన మైలురాయిని అందుకుంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అక్కడ వసూళ్ల సునామీ సృష్టిస్తూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Read Also:Pandavani Folk Singer Death:జానపద కళాకారిణి తీజన్ బాయి కన్నుమూత!
సోలో ఫీమేల్ లీడ్‌గా సమంత రికార్డ్

ఈ చిత్రం ఉత్తర అమెరికాలో ఏకంగా 2 మిలియన్ డాలర్ల ($2 Million+) వసూళ్ల క్లబ్‌లో చేరినట్లు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యాంగిర సినిమాస్’ అధికారికంగా వెల్లడించింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఉత్తర అమెరికా మార్కెట్లో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు సోలో ఫీమేల్ లీడ్ (లేడీ ఓరియెంటెడ్) సినిమాగా ‘మా ఇంటి బంగారం’ అల్-టైమ్ రికార్డు సృష్టించింది. ఒక అగ్ర హీరో సినిమా స్థాయికి తగ్గకుండా సమంత సినిమా అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
Maa Inti Bangaram Collections: రూ.100 కోట్ల క్లబ్ వైపు అడుగులు.. ప్రపంచవ్యాప్త వసూళ్లు ఇవే
కేవలం ఓవర్సీస్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సమంత పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు నందిని రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కవుట్ కావడంతో ఈ చిత్రం లాంగ్ రన్‌లో దూసుకుపోతోంది. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అంతకు మించిన ఘనవిజయాన్ని అందుకొని సమంత కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
హరీశన్న 'సిద్దిపేట కా షేర్'.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

