AP ICET results: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ (AP ICET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.
Read Also: Puttaparthi AMCA: 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

AP ICET results: ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,198 మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా, హాజరైన వారిలో 21,205 మంది ప్రవేశాలకు అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఫలితాలలో కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి అత్యంత ప్రతిభ కనబరిచి 166.094 మార్కులతో స్టేట్ ప్రథమ ర్యాంక్ (State First Rank) సాధించి టాపర్‌గా నిలిచారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను నేరుగా https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లింక్ ద్వారా పొందవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

