Andhra Pradesh airports: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు శుభవార్త. రాష్ట్రంలోని కీలక విమానాశ్రయాల్లో మద్యం విక్రయాలకు అనుమతి లభించింది. ఇకపై ఏపీ విమానాశ్రయాల్లో బార్‌లు వైన్‌షాపులు అందుబాటులోకి రానున్నాయి.
ఇతర ప్రధాన నగరాల తరహాలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిబంధనలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వారంలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.
Read also: Ambati Rambabu: వైసీపీ నేతలు అంబటి, పేర్ని నానిలపై అట్రాసిటీ కేసు నమోదు
Bars and wine shops at AP airports
దరఖాస్తు ఫీజులు లైసెన్స్ వివరాలు
ఈ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారు నాన్-రిఫండబుల్ రుసుము చెల్లించాలి. బార్లకు 5 లక్షలు, వైన్‌షాపులకు 2 లక్షల రూపాయలను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. వార్షిక రద్దీని బట్టి బార్ల లైసెన్స్ ఫీజు ఉంటుంది. 20 లక్షల కంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే 25 లక్షలు, తక్కువ ఉంటే 15 లక్షల రూపాయలు చెల్లించాలి. వైన్‌షాపుల లైసెన్స్ ఫీజును మాత్రం కోటి రూపాయలుగా ఖరారు చేశారు. ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర విధానాలను పరిశీలించాక ఈ ఫీజులు నిర్ణయించారు.
Andhra Pradesh airports: సేవల నిర్వహణ భద్రతా నిబంధనలు
ప్రతి బార్ లైసెన్స్‌తో గరిష్ఠంగా మూడు సర్వీసింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. విమానాశ్రయాల పని వేళలకు అనుగుణంగా 24 గంటలు ఈ బార్లు తెరిచి ఉంచవచ్చు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. భద్రతా ఆదేశాలను విధిగా పాటించాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన సేవలు అందించేలా నిబంధనలు రూపొందించారు. ఈ నిర్ణయం విమానాశ్రయాల ఆదాయంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
Epaper: epaper.vaartha.com

