Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే

ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే

వార్త 1 month ago

AP cabinet meeting:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షర్యంలో జరిగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, కొత్త ఉద్యోగాల భర్తీ వంటి అంశాలకు ప్రాధాన్యం లభించింది.

అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై మంత్రులు చర్చించారు. పరిశ్రమలు, విద్య, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Read also: AP Coconut Farmers: కొబ్బరి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

 Key decisions from the AP Cabinet meeting

స్థానిక సంస్థల ఎన్నికలు మరియు బీసీ రిజర్వేషన్లు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా చట్టసవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ రక్షణ చట్టం అమలుతో పాటు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికల విధానంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

AP cabinet meeting:జాబ్ క్యాలెండర్ మరియు నూతన ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు మేలు చేసేలా జాబ్ క్యాలెండర్ ప్రకారం పది వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ బీసీ విద్యార్థులకోసం ప్రత్యేకంగా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా తిరుపతి, సూర్యలంక, కాకినాడ ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంధన రంగంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంతో పాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లులపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు ఖరారు చేశారు.

Epaper: epaper.vaartha.com

రాయలసీమ రైతులకు మంత్రి పయ్యావుల తీపికబురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha