N Balasubramanyam: ఆంధ్రప్రదేశ్ పోలీస్, పాలనా విభాగాల్లో విషాదం నెలకొంది. సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.
బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో పోలీస్, ప్రభుత్వ శాఖల అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
AP New Airport: గుడ్‌న్యూస్.. ఏపీలో మరో కొత్త విమానాశ్రయం!
1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి
1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. తన సుదీర్ఘ సర్వీసులో రవాణా, సాంకేతికత, శాంతిభద్రతల విభాగాల్లో సేవలందించారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు. అలాగే ఈ-ప్రగతి అథారిటీ సీఈఓగా, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈఓగా బాధ్యతలు చేపట్టి పాలనా వ్యవహారాల్లో తనదైన ముద్ర వేశారు.

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు
2026 ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యంను ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ బాధ్యతల్లోనూ ఆయన తన నిబద్ధతతో పనిచేశారు. విధి నిర్వహణలో ఆయన కనబరిచిన అంకితభావం, పనితీరును పలువురు అధికారులు ప్రశంసించారు.
N Balasubramanyam: ప్రముఖుల సంతాపం
బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఏపీ పోలీస్ శాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం రాష్ట్ర పోలీస్, పాలనా వ్యవస్థలకు తీరని లోటుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.
Epaper: epaper.vaartha.com

