AP POLYCET 2026 Results: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. పాలిసెట్-2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పాలిసెట్ పరీక్షా ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: Andhra Pradesh: మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
AP POLYCET 2026 Results: ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. అలాగే ఈసారి ఫలితాల సేకరణను మరింత సులభతరం చేస్తూ వాట్సప్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
- అధికారిక వెబ్‌సైట్: polycetap.ap.gov.in
- వాట్సప్ ద్వారా: మీ ఫలితాలను పొందడానికి 95523 00009 అనే మన మిత్ర వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేయవచ్చు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ర్యాంకుల ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
మున్సిపాలిటీలో భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలు!

