Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్

ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్

వార్త 1 week ago

AP PGECET 2026 Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలు వెల్లడయ్యాయి.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం హాజరైన వారు9,990 మంది, ఉత్తీర్ణత సాధించిన వారు 9,320 మంది, ఉత్తీర్ణత శాతం 93.29% ,ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Read Also : AP New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక నిర్ణయం

AP PGECET 2026 Results: ఫలితాలు, ర్యాంకు కార్డు డౌన్‌లోడ్

విద్యార్థులు తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

  1. ముందుగా అధికారిక పోర్టల్ https://cets.apsche.ap.gov.in సందర్శించండి.
  2. హోమ్ పేజీలో ఉన్న ‘Results/Rank Card’ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్ ఎంటర్ చేయండి.
  4. మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి, భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విద్యార్థుల సౌలభ్యం కోసం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులు 9552300009 అనే నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా తమ ఫలితాల సమాచారాన్ని పొందవచ్చు. అర్హత సాధించిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇకపై ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha