Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక నిర్ణయం

ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక నిర్ణయం

వార్త 3 months ago

AP New Pensions: ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరటనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

Read also: AP Woman Suicide: సౌదీలో తిరుపతి మహిళ ఆత్మహత్య.. కుటుంబ కలహాలేనా కారణం?

 CM Chandrababu Naidu Pension Scheme AP

AP New Pensions: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్

కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధులతో సతమతమవుతున్న వారికి కొత్తగా 895 పెన్షన్లను మంజూరు చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ప్రతి నెల 86 లక్షల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే వితంతు పెన్షన్ల ప్రక్రియ పూర్తి కాగా, ఇప్పుడు అనారోగ్య బాధితులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

10 లక్షల మందికి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తే సుమారు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జగన్‌తో కొడాలి నాని భేటీ.. పార్టీ మారడం పై క్లారిటీ !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha