Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం

వార్త 1 month ago

Aadabidda Nidhi Scheme:ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా పద్దెనిమిది నిండిన అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు.

రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు మేలు జరిగేలా ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనుంది.

Read also: Salur School Accident: ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి

 Implementation of the ‘Aadabidda Nidhi’ scheme

ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సాయం

ఈ పథకం కింద అర్హత పొందిన మహిళలకు ఏడాదికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయల ఖాతాలో జమ కానున్నాయి. నిధుల లభ్యత అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. అసెంబ్లీ సమావేశాలలో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అర్హులైన మహిళలు ఎంతో ఆసక్తిగా ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు.

Aadabidda Nidhi Scheme:త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఈ పథకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు దరఖాస్తు చేసుకునే విధానం విడుదలవుతుంది. అర్హత వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకున్న మహిళలకు నేరుగా నగదు అందనుంది. మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Epaper: epaper.vaartha.com

YCPకి నచ్చినట్లు సభ నడవదు- పయ్యావుల వార్నింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha