AP government:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణా చర్యలపై కఠినమైన నిర్ణయం తీసుకుంది. జీవో ఎంఎస్ నంబర్ 177 ద్వారా సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇకపై ప్రతి ఉద్యోగిపై జరిగే విచారణ త్వరితగతిన పూర్తి కావాలని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకతతో విచారణ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read also: Malla Reddy : ఊర మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న మల్లారెడ్డి
New disciplinary guidelines for government employees
విచారణ అధికారులదే పూర్తి జవాబుదారీతనం
ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎంక్వైరీ అధికారుల మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ఛార్జ్ మెమో జారీ చేసిన క్షణం నుంచి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ప్రతి దశను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. ఒకవేళ విచారణలో ఎవరైనా కావాలని ఆలస్యం చేస్తే ఆ అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయి. తప్పు చేసిన వారిపై తక్షణమే కొరడా ఝళిపించేలా ఈ నిబంధనలు రూపుదిద్దుకున్నాయి.
AP government:కలెక్టర్లు మరియు హెచ్‌ఓడీల పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ విచారణ కేసులను నిరంతరం పరిశీలించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అలాగే హెచ్‌ఓడీలకు అప్పగించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా ఈ చర్యలు దోహదపడతాయి.
Epaper: epaper.vaartha.com

