Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన చంద్రబాబు

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన చంద్రబాబు

వార్త 2 weeks ago

Polavaram Left Main Canal Godavari Waters: ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు.

Read Also : Malla Reddy : ఊర మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న మల్లారెడ్డి

 Godavari waters for North Andhra… Chandrababu performs ‘Jalaharathi’

Polavaram Left Main Canal Godavari Waters: జలహారతి పట్టిన ముఖ్యమంత్రి

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని, పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రెగ్యులేటర్ ఆన్ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఘనస్వాగతం పలికిన ప్రజలు, రైతులకు అభివాదం చేశారు. కాలువ వద్దకు చేరుకున్న సీఎం, గోదావరి మాతకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జలహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం. రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

స్వర్గీయ హరికృష్ణ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha