Amaravati International Airport: ప్రతిపాదిత అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రంగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చబోతున్న ఒక భారీ ఏవియేషన్ హబ్‌గా అవతరించబోతోంది.
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామం వద్ద సుమారు 4,618 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో భారీ ప్రాజెక్టుల వల్ల గ్రామాలు తరలిపోవాల్సి వచ్చేది, కానీ అమరావతి విమానాశ్రయం విషయంలో ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించకుండా భూసేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాజధాని సచివాలయానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఇది భవిష్యత్తులో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది.
Read Also:Vizag accident: రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

Amaravati International Airport:రావెల ఎయిర్‌పోర్ట్ స్పెషల్ స్టోరీ!
సాంకేతికంగా ఈ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగి ఉండబోతోంది. భారీ బోయింగ్ విమానాలు సైతం సులభంగా దిగేందుకు వీలుగా విశాలమైన రన్‌వేను డిజైన్ చేశారు. రాబోయే 60 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐదు దశల్లో ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు. రవాణా పరంగా కోల్‌కతా – చెన్నై మరియు అనంతపురం హైవేలకు అనుసంధానంగా ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు ఇది ఎంతో అనుకూలంగా మారుతుంది. ఎంఆర్ఓ (MRO) సదుపాయాలు మరియు వాణిజ్య సముదాయాల ఏర్పాటుతో అమరావతి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తుందని చెప్పవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

