Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

వార్త 1 week ago

తల్లి కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు

Vizag accident: వివాహం జరిగి 24 గంటలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అల్లుకున్నాయి.

వివరాల్లోకి వెళితే అగనంపూడి కొండయ్య వలస గ్రామానికి చెందిన వధువు రామేశ్వరిని, వాడ చీపురుపల్లి గ్రామానికి చెందిన నర్సింగ్ రావుకి బుధవారం అంగరంగ వైభవంగా పెద్దలు వివాహం జరిపించినారు.

Read also: Rajnath Singh AP Visit: రక్షణ మంత్రి పర్యటన: పుట్టపర్తిలో భారీ ఏరోస్పేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

 New Bride Meets Tragic End on Wedding Day

Vizag accident: చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి

అయితే ఆ జంట గురువారం అత్తవారింటికి అడుగు పెట్టేందుకు వచ్చే సమయంలో అగనంపూడి జనరల్ హాస్పిటల్ కి వెళ్లే రహదారిలో శనివాడ వాకింగ్ ట్రాకింగ్ దగ్గరలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎలక్ట్రికల్ ఢీకొనడంతో వధువు అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి విషమంగా ఉండడంతో కేజీహెచ్ తరలించారు. అయితే కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నా పెండ్లి కూతురు తల్లి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి సౌత్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha