Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీఎల్-2026 షురూ.. తొలి మ్యాచ్‌లోనే పరుగుల విధ్వంసం సృష్టించిన కాకినాడ కింగ్స్

ఏపీఎల్-2026 షురూ.. తొలి మ్యాచ్‌లోనే పరుగుల విధ్వంసం సృష్టించిన కాకినాడ కింగ్స్

వార్త 4 days ago

APL 2026: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్' (APL) ఐదో సీజన్ అట్టహాసంగా సిద్ధమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ (ACA-VDCA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది.

అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న దురదృష్టకర అగ్నిప్రమాద ఘటన కారణంగా, ఎలాంటి హంగు ఆర్భాటాలు, వేడుకలు లేకుండా ఈ టోర్నీని అత్యంత నిరాడంబరంగా మొదలుపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.

Read also: Bhogapuram Airport Uttandhra:భోగాపురంతో ఉత్తరాంధ్ర.. 'ఉత్తమాంధ్ర' అవుతుంది:రామ్మోహన్ నాయుడు

తొలి మ్యాచ్‌లోనే కాకినాడ కింగ్స్ పరుగుల విధ్వంసం

టోర్నీలో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లోనే కాకినాడ కింగ్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సింహాద్రి వైజాగ్ లయన్స్‌తో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. యువ సంచలనం యువన్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ అజేయ అర్ధశతకంతో (Half-Century) జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా ఓపెనర్ అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్‌లతో పాటు వికెట్ కీపర్ లక్షజ్ రెడ్డి సైతం వేగంగా ఆడుతూ విలువైన పరుగులు జోడించారు.

APL 2026: చేతులెత్తేసిన వైజాగ్ లయన్స్ బ్యాటర్లు.. కాకినాడ ఘన విజయం

220 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. కాకినాడ కింగ్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దాటికి వైజాగ్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూ 18.4 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో కాకినాడ కింగ్స్ 71 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

మెరిసిన ఆంజనేయులు.. యువన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’

కాకినాడ బౌలింగ్ విభాగంలో ఆంజనేయులు అద్భుత ప్రదర్శన చేస్తూ 3 వికెట్లు పడగొట్టి వైజాగ్ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను మలుపు తిప్పిన యువ బ్యాటర్ యువన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కాకినాడ కింగ్స్, ఈ ఐదో సీజన్‌లో తమ ప్రయాణాన్ని విజయంతో ఘనంగా చాటుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read Also:

కూటమి రెండేళ్ల పాలన విఫలం..మద్యం దోపిడీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha