Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి 'రాయల్' ఎంట్రీ.. బుల్లెట్ బైక్ వీడియోతో లోకేశ్ ఆసక్తికర పోస్ట్!

ఏపీకి 'రాయల్' ఎంట్రీ.. బుల్లెట్ బైక్ వీడియోతో లోకేశ్ ఆసక్తికర పోస్ట్!

వార్త 2 weeks ago

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ సంస్థ రాబోతోందనే సంకేతాలను మంత్రి నారా లోకేశ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?’ అనే క్యాప్షన్‌తో లోకేశ్ స్వయంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను నడుపుతున్న వీడియోను పంచుకున్నారు.

Read also: APCPDCL: నిరంతర విద్యుత్ సరఫరా: సిఎండి

పెట్టుబడుల దిశగా అడుగులు

ఈ వీడియో ద్వారా ప్రసిద్ధ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఆంధ్రప్రదేశ్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోందని లోకేశ్ పరోక్షంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటనలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. లోకేశ్(Nara Lokesh) స్టైలిష్‌గా బుల్లెట్ బైక్ డ్రైవ్ చేస్తున్న ఈ వీడియో చూస్తుంటే, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మళ్లీ గాడిన పడబోతోందని నెటిజన్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha