Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

వార్త 3 months ago

Carrier AC Plant: తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ సంస్థ కొత్త యూనిట్ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ పునాది వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని భారతదేశపు కూల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.

సుమారు 1000 కోట్ల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో అదనంగా 3వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి నాణ్యతతో ఏసీలు తయారు చేసే ఈ సంస్థ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత బలోపేతం కానుంది.

Read also: APCPDCL: నిరంతర విద్యుత్ సరఫరా: సిఎండి

 Carrier AC industry launch in Sri City

Carrier AC Plant: 2028 నాటికి ఏసీల ఉత్పత్తిలో అగ్రస్థానం

రాష్ట్రంలో ప్రస్తుతం 9 ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పాటు 30కి పైగా విడిభాగాల సరఫరా కేంద్రాలు ఉండటం వల్ల ఏపీలో బలమైన ఎకో సిస్టమ్ తయారైంది. 2027 నాటికి దేశంలో తయారయ్యే ఏసీలలో 60 శాతం, అలాగే 2028 నాటికి ఏకంగా 80 శాతం వాటా ఏపీ నుంచే ఉంటుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా డేటా సెంటర్లకు అవసరమైన అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్స్‌ను కూడా ఇక్కడే రూపొందిస్తామని వెల్లడించారు.

వేగంగా అనుమతులు 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు విజన్ లో భాగంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. అనుమతుల విషయంలో ఎక్కడా ఆలస్యం లేకుండా వాట్సాప్ మెసేజ్ దూరంలోనే తాము అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ గా మార్చే క్రమంలో ఈ తయారీ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వైసీపీ నేర చరిత్ర బయటపడింది.. అనురాధ సంచలన ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha