Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ వేగవంతం..సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష

ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ వేగవంతం..సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష

వార్త 3 months ago

Swarna Andhra Vision 2047: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న 'స్వర్ణాంధ్ర విజన్ 2047' కార్యాచరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా సచివాలయంలో ప్రాథమిక రంగంలోని (Primary Sector) ‘6 ముఖ్యాంశాల (6 Missions)’ పై సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అత్యున్నత స్థాయి భేటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్‌తో పాటు వివిధ అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

Read Also :Pawan Kalyan on Godavari Pollution: గోదావరి కాలుష్యంపై డిప్యూటి సీఎం సీరియస్.. నివేదికకు ఆదేశం

సాగు, ఆక్వా, పశుసంవర్ధక రంగాలపై ప్రత్యేక ఫోకస్

 AP CM Chandrababu Naidu Reviews Agriculture and Primary Sectors for Swarna Andhra Vision 2047

రాష్ట్ర జీవనాధారమైన వ్యవసాయం, హార్టికల్చర్ (తోటపని), మరియు కోస్తా తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన ఆక్వా కల్చర్ రంగాల ఆధునీకరణపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మరియు పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి పరిశ్రమను బలోపేతం చేయడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విజన్ 2047 నాటికి ప్రాథమిక రంగం నుండి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (GSDP) రెట్టింపు చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

Swarna Andhra Vision 2047: ఎల్‌నినో ఎఫెక్ట్, విత్తన పంపిణీపై సీఎం అలర్ట్

త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో క్షేత్రస్థాయి సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న 'ఎల్‌నినో' (El Nino) వాతావరణ ప్రభావం, దానివల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, జలాశయాలలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూనే.. రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ (Seed Distribution) లో ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లేపాక్షి సిబ్బందికి శుభవార్త.. 10 శాతానికి పైగా పెరగనున్న జీతాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha