Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎరువులను పక్కదారి పట్టిస్తే లైసెన్స్ రద్దు.. గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి

ఎరువులను పక్కదారి పట్టిస్తే లైసెన్స్ రద్దు.. గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి

వార్త 4 days ago

Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను పక్కదారి పట్టిస్తూ, వాటిని ఇతర వ్యవసాయేతర పనులకు, బ్లాక్ మార్కెట్‌కు తరలించడంపై రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగు సీజన్‌లో రాష్ట్రంలో కావాలనే కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించి, బ్లాక్‌లో విక్రయాల ద్వారా సొమ్ము చేసుకునే అక్రమార్కుల ఆట కట్టించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెర్టిలైజర్ డీలర్లు, ప్రైవేట్ గోదాములపై తక్షణమే ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు మంత్రి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also : TTD Srivari Vastram E Auction: తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం.. ఆన్‌లైన్‌లో ఎలా కొనాలో తెలుసుకోండి!

 License will be cancelled if fertilizers are diverted.. Conduct inspections on godowns

Minister Atchannaidu: అధికారుల నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశం

రాష్ట్రంలో ఎరువుల పంపిణీ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారుల వైపు నుంచి ఏమైనా లోపాలు లేదా నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలోనూ తక్షణమే సమగ్ర విచారణ జరపాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. క్షేత్రస్థాయిలో అక్రమార్కులతో చేతులు కలిపే అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసంగే లేదని ఆయన స్పష్టం చేశారు.

రైతులకు సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ఇకపై ప్రతిరోజూ జిల్లాల వారీగా ఎరువుల అందుబాటు, నిల్వలపై (స్టాక్) ప్రత్యేకంగా మానిటరింగ్ చేసే వ్యవస్థను తీసుకువస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అన్నదాతలను మోసం చేసే ఏ ఒక్క చర్యను కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన హెచ్చరించారు.

లైసెన్సుల రద్దు.. క్రిమినల్ కేసులు

చట్టాన్ని ఉల్లంఘించి ఏ డీలరైనా ఎరువులను బ్లాక్‌కు తరలించినా లేదా పక్కదారి పట్టించినా వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. కేవలం లైసెన్స్ రద్దుతోనే సరిపెట్టకుండా, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆజ్ఞాపించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఎరువుల కొరత తీరి, రైతులకు ఊరట లభించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha