Kodali Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తన రాజకీయ భవిష్యత్తుపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, బుధవారం తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన ఆయన, ఇటీవల మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబంతో కలిసి తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను దర్శించుకున్నారు. ఒక బీజేపీ నేతతో కలిసి ఆయన బహిరంగంగా కనిపించడంతో, నాని వైసీపీని వీడి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
Read Also : AP Cyber Crime : సైబర్ నేరాలపై చంద్రబాబు ప్రత్యేక యాక్షన్ ప్లాన్
Kodali Nani: జగన్ వెంటే నా ప్రయాణం
ఈ వార్తలపై నేరుగా స్పందించకుండానే, జగన్‌తో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా నాని గట్టి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భేటీ ద్వారా తాను వైఎస్ జగన్ వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి..
చాలా కాలం తర్వాత గుడివాడ నియోజకవర్గంతో పాటు ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని మళ్ళీ కనిపిస్తుండటంతో వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నియోజకవర్గంలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీతో గత కొన్ని వారాలుగా నాని చుట్టూ తిరిగిన 'పార్టీ మార్పు' చర్చకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

