Bharosa Party Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ కొలువుదీరింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని, క్రైస్తవుల సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం 'భరోసా' పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు అభినయ్ దర్శన్ ప్రకటించారు.
కాకినాడ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఈ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
Read Also:Smart Phones to VOAs: గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ ఫోన్లు!
Bharosa Party Andhra Pradesh: కడప జిల్లా నుంచి సరికొత్త నాయకత్వం
సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న అభినయ్ దర్శన్ స్వస్థలం కడప జిల్లాలోని ఎర్రముక్కపల్లి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కడప జిల్లాకు చెందినవారే కావడంతో, అదే ప్రాంతం నుంచి మరో రాజకీయ పార్టీ పుట్టుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని క్రైస్తవుల తరఫున పోరాడటం కోసం తాను పార్టీని ఏర్పాటు చేసినట్లు అభినయ్ ప్రకటించారు. ఎరుపు, ముదురు నీలం రంగులతో కూడిన పార్టీ జెండాను అభినయ్ ఆవిష్కరించారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి సరిగ్గా ఏడాది పూర్తయిన సమయంలో, ప్రథమ వర్ధంతి రోజున తాను భరోసా పార్టీని ఏర్పాటు చేసినట్లు అభినయ్ దర్శన్ తెలిపారు. క్రైస్తవుడికి కష్టం వస్తే మాట్లాడటానికి తాను ఉన్నానని అభినయ్ తెలిపారు. ప్రవీణ్ పగడాల మరణం నిద్రపోతున్న సింహాల లాంటి క్రిస్ట్రియన్లను తట్టి లేపిందన్నారు. దేశానికి ఎన్నో మంచి పనులను క్రైస్తవ మిషనరీలు చేశాయని అభినయ్ చెప్పుకొచ్చారు. ప్రవీణ్ పగడాల గొంతుకను క్రైస్తవ సమాజం కోల్పోయిన రోజునే.. తన గొంతు లేచిందన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

