పోలీసుల చర్యలపై చర్చ
Andhra pradesh police : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూ సంచలనంగా మారాయి. రెండు వేర్వేరు ఘటనల్లో నిందితులు పోలీసులపై తిరగబడటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనలు మరోసారి రాష్ట్రంలో పోలీసు చర్యలపై చర్చకు దారి తీశాయి.
కడపలో మైనర్ బాలిక హత్య కేసు
కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న వెంకటేష్ అనే యువకుడు బాలిక గొంతు కోసి హత్య చేసిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు నిందితుడిని పట్టుకునే క్రమంలో బసాపురం చెక్‌పోస్ట్ వద్ద అతడిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని హెచ్చరించినా అతడు పోలీసులపై దాడి చేయడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వెంకటేష్ కాలికి గాయమైంది.
అనంతపురంలో బాలుడి హత్య కేసు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడు హేమచంద్రను డబ్బు కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన సర్వేష్ అనే నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో సర్వేష్ పారిపోవడానికి ప్రయత్నించి, పోలీసులపై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ పరిస్థితిలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు గాలిలోకి, రెండు రౌండ్లు మోకాళ్ల కిందకు కాల్చడంతో నిందితుడు గాయపడ్డాడు.
Read Also:Guntur School Bus Accident: స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!
Andhra pradesh policeపోలీసుల చర్యలపై చర్చ
ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు పోలీసులపై దాడి చేసిన తర్వాతే కాల్పులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. అయితే వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం రాష్ట్రంలో నేరాల పరిస్థితిపై చర్చకు దారి తీస్తోంది. కొంతమంది పోలీసుల కఠిన చర్యలు నేరాలను తగ్గించవచ్చని అంటుంటే, మరికొందరు నేరాల నివారణకు ముందస్తు చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

