పండించిన పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
Singanamala: అఖిల భారత కిసాన్ సభ 90 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయం వద్ద నియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్ అధ్యక్షతన ఏఐకెఎస్ జెండాను రైతు సంఘం జిల్లా అధ్యక్షులుడి చిన్నప్ప యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ స్థాపించినారుఅని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు స్వామి సహజ నంద సరస్వతి తొలి అధ్యక్షుడిగా రైతు బాంధవుడు ప్రొఫెసర్ ఎన్జీరంగాని ప్రధాన కార్యదర్శిగా ఆనాడు ఎన్నుకోవడం జరిగింది.
Read Also:Guntur School Bus Accident: స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!
Singanamala: ఏఐకెఎస్ చారిత్రక నేపథ్యం
అయితే రైతాంగ ఉద్యమాల పునాది అంతకుముందే ఆంధ్ర ప్రదేశ్లో 1928 లో గుంటూరులో ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంఘం ఏర్పడి రైతుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేసి భూమిశిస్తూ పెంపు జమిందార్ వ్యవస్థ రైతాంగ అప్పుల పై పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కి దక్కుతుందిఅన్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం లో కూడా పోరాటాలు అప్పటినుండి నేటి వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయిఅని బ్రిటిష్ కాలం నుండి ఇంతవరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేక పంటలు సరిగా పండక వ్యవసాయంలో అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటుండగా వాటిని అధ్యయనం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వ్యవసాయ రంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రభుత్వ పాలసీలు రైతులు, కౌలు రైతుల జీవితాలను నట్టేట ముంచుతున్నాయి.
55 ఏళ్లు నిండిన రైతులకు. కౌలు రైతులకు 10,000 పెన్షన్స్ సౌకర్యం కల్పించాలి ,స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలి, వరి క్వింటాలకు 3000గా కేంద్రం ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని రైతులకు కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు అందించాలి పేద మధ్యతరగతి రైతులకు వ్యవసాయంత్రం పరికరా లను 90% సబ్సిడీపై అందించాలి రైతులకు ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు,ఈకార్యక్రమంలో
చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి చేనేత మధు,రైతు సంఘం సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నారప్ప, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మునుస్వామి ,రూప్ల నాయక్, జయరాం నాయక్, దస్తగిరి, భాష, వెంకటేశు, అనుమప్ప, లక్ష్మయ్య, నారాయణ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

