Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో నిప్పుల కొలిమి.. రేపు 50 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

ఏపీలో నిప్పుల కొలిమి.. రేపు 50 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

వార్త 3 months ago

AP Heatwave Alert: రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఊహించని విధంగా ఉండబోతోంది.

Read also: Telangana weather update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. ఆపై పెరగనున్నఎండలు ఉష్ణోగ్రతలు

 AP Heatwave Alert severe summer sun

జిల్లాల వారీగా ఎండల తీవ్రత వివరాలు

గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు కోనసీమ, బాపట్ల, నంద్యాల ప్రాంతాల్లో మండుటెండలు జనజీవనాన్ని అతలాకుతలం చేయనున్నాయి. కోస్తా తీరప్రాంత జిల్లాల్లో ఎండలతో పాటు గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల పగటిపూట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

AP Heatwave Alert: విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు

తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు నివారించడం మంచిది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి తగినన్ని నీళ్లు, మజ్జిగ, కొబ్బరిబొండాల వంటి ద్రవాహారం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

3 రోజులు వర్ష సూచన.. తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha