Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో రేపటి నుంచే టెన్త్ సప్లిమెంటరీ పేపర్ల మూల్యాంకనం..రిజల్ట్స్ ఎప్పుడంటే?

ఏపీలో రేపటి నుంచే టెన్త్ సప్లిమెంటరీ పేపర్ల మూల్యాంకనం..రిజల్ట్స్ ఎప్పుడంటే?

వార్త 2 months ago

AP 10th Supplementary Evaluation: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగియడంతో, విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది.

మే 25న ప్రారంభమై, జూన్ 4వ తేదీతో ముగిసిన ఈ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ సోమవారం (జూన్ 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లెక్కింపు ప్రక్రియ జూన్ 10వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Read also:Chintakayala Vijay: టీడీపీ రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం

24 జిల్లాల్లో టెన్త్ స్పాట్ కేంద్రాలు.. జూన్ 18 కల్లా ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్!

రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మినహా మిగిలిన 24 జిల్లాల్లో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విధులకు ఎంపికైన అసిస్టెంట్ ఎగ్జామినర్స్ (AEలు), చీఫ్ ఎగ్జామినర్స్ (CEలు), స్పెషల్ అసిస్టెంట్లు సోమవారం ఉదయం 8 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రాలలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. బోర్డు నిర్దేశించిన సమయానికల్లా మూల్యాంకనాన్ని పూర్తి చేసేలా ఇప్పటికే ఉపాధ్యాయులకు డ్యూటీ ఆర్డర్స్ జారీ చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు.

AP 10th Supplementary Evaluation: ప్రారంభమైన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం:

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల లెక్కింపు ఆదివారం నుంచే ప్రారంభమైంది. మొదటి రోజున తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీతో పాటు మైనర్ లాంగ్వేజెస్ పేపర్ల వాల్యుయేషన్ చేపట్టారు. సోమవారం (జూన్ 8) నుంచి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ పేపర్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

స్పాట్ విధులకు ఎంపికైన అధ్యాపకులు ఉదయం 9:30 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని, ఆర్డర్స్ వచ్చిన వారిని తక్షణమే రిలీవ్ చేయాలని కాలేజీ ప్రిన్సిపాళ్లకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. కాగా, జూన్ 18వ తేదీ నాటికే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

డిమాండ్లు తీర్చకుంటే పోరాటమే.. కూటమి ప్రభుత్వంపై ఏపీజేఏసీ సంఘాల హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha