హనుమనపల్లిని సందర్శించిన డిఎం అండ్ హెచ్ ఓ, డాక్టర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఓ అక్కడే మకాo
Food poisoning: శ్రీసత్యసాయి జిల్లా అగళి మండల పరిధిలోని హనుమనపల్లి గ్రామంలో ఓ పెళ్లి భోజనం ఆరగించి 20 మంది వాంతులు, విరేచనాలతో మంచంపట్టారు.
ఈ విషాధ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దరంగ కుమార్తె వివాహానికి బంధుమిత్రులను పిలిచి వైభవంగా వివాహం నిర్వహించారు. ఆ పెళ్లిలో వింధు భోజనం ఆరగించారు. ఆదివారం ఉదయం చేసిన అనుపకాయల సాంభారుతో భోజనం తిన్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అదే సాంబారుతో భోజనం చేశారు. సాంబారు పాచిపోయింది. ఆ సాంబారును ఆరగించడంతో పెళ్లికి వచ్చిన వారు అదే గ్రామానికి చెందిన 20 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది.
Food poisoning at wedding feast in Hanumanapalli
Food poisoning: వైద్య శిబిరం ఏర్పాటు – బాధితులకు చికిత్స
చికిత్స అందించండి అని ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బందికి తెలియజేశారు. ఆ విషయాన్ని జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ మంజువాణి విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన జరిగిన గ్రామంలోని పాఠశాలకు చేరుకుని వారికి అందిస్తున్న చికిత్సను పరిశీలించారు. నియోజకవర్గలోని డాక్టర్లను, సిబ్బందిని అక్కడికి మోహరించి చికిత్స అందించారు. సెలెన్ బాటిల్ను అందించడం, ఓఆర్ఎస్ పాకెట్లను అందించడం, మాత్రలు ఇవ్వడంతో కొద్దికొద్దిగా రికవరీ మొదలైందని సిబ్బంది డిఎం అండ్ హెచ్ఎకు తెలిపారు.
అధికారుల ఆదేశాలు
ఈ సందర్భంగా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ మంజువాణి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంచినీటిని సేవించాలని తెలపడంతోపాటు ప్రత్యేకంగా ఉదయం, రాత్రి మూడురోజులపాటు చికిత్స అందించడానికి ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లతో ఓ టీంను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన టీంలో ఉన్నవారు సదరు అనారోగ్యానికి గురైన వారికి సక్రమంగా వైద్యం అందించాలని, ఒకవేళ గైర్హాజరైతే అప్పటికప్పుడే షోకాజ్నోటీసులు ఇస్తామన్నారు. 108 వాహనాన్ని సైతం అక్కడే ఉంచారు. గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగిస్తున్నారు. ఈ వైద్య శిభిరంలో డిప్యూటీ డీఎం అండ్ హెచి డా. రవి, తహశీల్దారు సుబ్బారావు, మరో ఇద్దరు డాక్టర్లు కిరణ్నాయక్, సూపర్వైజర్ జయమ్మ, హెల్త్ అసిస్టెంట్ సుందరయ్య, సుబ్బయ్య, మంజుళ, ఎంఎలెచ్పిలు, ఏఎన్ఎంలు, కార్యదర్శి రాజునాయక్, ఎంపిడిఓ గంగాధర్, డిప్యూటీ ఎంపిడిఓ రెడ్డి ప్రకాష్, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

