Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. కర్నూలులో 44.8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత!

ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. కర్నూలులో 44.8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత!

వార్త 2 months ago

AP Heatwave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

Read Also : Srisailam: మల్లన్న సేవలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్

 The scorching sun is creating havoc in AP.. Kurnool records a record temperature of 44.8 degrees!

కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత

రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో పాటు ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

AP Heatwave: 20కి పైగా జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి..

కేవలం రాయలసీమలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. కోస్తాంధ్రలోనూ ఎండల తీవ్రత పెరిగింది. రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha