Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సాధించిన విజయాన్ని సాకుగా చూపిస్తూ, పవన్‌పై అంబటి విసిరిన సెటైర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ స్థాపించిన నటుడు విజయ్, ఒంటరిగా పోరాడి అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ పరిణామాన్ని ఏపీ రాజకీయాలకు ముడిపెడుతూ అంబటి రాంబాబు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “తమిళనాడులో విజయ్ గెలిస్తే.. ఇక్కడ పవన్‌పై సెటైర్లు పడుతున్నాయని, ఇది ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది” అంటూ రాసుకొచ్చారు. విజయ్ సొంతంగా పోటీ చేసి గెలిచారని, కానీ పవన్ పొత్తులతోనే విజయం సాధించారనే అర్థం వచ్చేలా అంబటి ఈ పరోక్ష విమర్శలు సంధించారు.
Read Also : Kalyandurg Municipality Scam: మున్సిపాలిటీలో భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలు!
Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై జోస్యం
విమర్శలు పవన్‌తోనే ఆగిపోలేదు. ఏపీలోని చంద్రబాబు-లోకేశ్ ప్రభుత్వంపైనా ఆయన విరుచుకుపడ్డారు. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం (స్టాలిన్-ఉదయనిధి) ఏ విధంగానైతే ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొని ఓటమి పాలైందో, భవిష్యత్తులో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. పొరుగు రాష్ట్ర ఫలితాలు ఏపీలో మార్పుకు సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో అంబటిపై ఎదురుదాడికి దిగుతూ.. “వేరే రాష్ట్రాల గెలుపు ఓటముల గురించి మాట్లాడే ముందు, అసెంబ్లీలో మీకున్న 11 సీట్ల గురించి ఆలోచించుకోండి” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించినా అంబటిలో ఇంకా అహంకారం తగ్గలేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంబటి ట్వీట్లు మరియు వాటికి వస్తున్న కౌంటర్లతో ఏపీ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఇన్‌స్టా రీల్ చూసి ఇంటి బయట ఉన్న ఆకులతో కూర.. నలుగురికి అస్వస్థత

