Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీతో నీటి చర్చలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఏపీతో నీటి చర్చలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వార్త 1 week ago

Revanth Reddy: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై అత్యంత కీలకమైన ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జల జగడంపై చర్చలు సాగుతున్నాయని, అతి త్వరలోనే తెలంగాణ ప్రజలకు ఒక మంచి వార్త వింటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, పొరుగు రాష్ట్రంతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. చట్టబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన వాటాలో ఒక్క బొట్టు నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. తాము వివాదాలను సాగదీయడం (పంచాయతీ) కంటే, సమస్యల త్వరితగతిన పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. పాలమూరు, డిండి వంటి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తేనే ఏపీతో తదుపరి చర్చలు ముందుకుసాగుతాయని ఒక రకమైన కండిషన్ పెట్టారు.

 TelanganaWaterRights

read also: Telangana weather update: రాబోయే 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!

Revanth Reddy: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి: సీఎం ఆగ్రహం

గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా తీవ్రమైన వివక్షకు గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కనీసం భూసేకరణ ప్రక్రియను కూడా సక్రమంగా పూర్తి చేయకపోవడం వల్లే, ఇంతవరకు ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయామని విమర్శించారు. రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్న పాలమూరు జిల్లాను, అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.

వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాలమూరును సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే పూర్తి బాధ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని జిల్లా ప్రజలకు భరోసా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also

టీజీ పీజీఈసీఈటీ ఫలితాలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha