Jeevan Reddy Joining BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
ఏప్రిల్ 13వ తేదీన ఆయన అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ చేరిక ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
Read Also:Gadwal: 76 మంది విద్యా శాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
Equations Set to Shift with Jeevan Reddy’s Entry-KTR Steps into the Fray.
ఏప్రిల్ 7న జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్.. పార్టీలోకి ఆహ్వానం
జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏప్రిల్ 7వ తేదీన కేటీఆర్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయనతో భేటీ అయి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Jeevan Reddy Joining BRS:జగిత్యాలలో బీఆర్ఎస్ ప్లీనరీ.. భారీ శక్తి ప్రదర్శన
జీవన్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే, జగిత్యాల వేదికగా పార్టీ ప్లీనరీని నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తోంది. ఏప్రిల్ 13న ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లీనరీ ద్వారా జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో ఇతర కీలక నేతలు కూడా గులాబీ జెండా పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

