Paraquat Ban in Telangana: రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందును నిషేదించడం హర్షించదగిన పరిణామమని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు.
ఈ అంశంపై చర్చించేందుకు గురువారం రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్, సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విషపూరితమైన పారాక్వాట్ నిషేదించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేయడం సంతోషకరమన్నారు.
Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు
Paraquat Ban in Telangana: Ban should be imposed across the country like in Telangana
రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు రైతు కమిషన్ బృందం ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపింది. అత్యంత విషపూరితమైన పారాక్వాట్ వల్ల వందలాది మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గడ్డి, కలుపు మందులను నిషేదించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రైతు సంఘాల నేతలు రైతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన రైతు కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. విషపూరితమైన పారాక్వాట్ను నిషేదించాలని ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది.
రైతు కమిషన్ సూచన మేరకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం పెట్టడం, బుధవారం జీవో విడుదల చేయడం సంతోష మకరమని చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రంలో గడ్డి మందు నిషేదించడంతోపాటు దేశంలో కూడా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం కూడా శుభ పరిణామమని తెలిపారు. ఇక రైతులు కూడా విషపూరితమైన గడ్డి కలుపు మందుల వైపు వెళ్లొద్దని కమిషన్ చైర్మన్, సభ్యులు కోరారు. ప్రాణాలకు హాని చేయని, నేలను పాడుచేయని కలుపు మందులను వాడాలని సూచించారు. వీలైతే కలుపు తీసే యంత్ర పరికరాలు వినియోగిస్తే మంచిదన్నారు. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితోపాటు సభ్యులు కేవీఎన్రెడ్డి, గోపాల్రెడ్డి, భవానీరెడ్డి, భూమి సునీల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డిని కమిషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

