Telangana New Ration Shops: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎప్రిల్ లో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించడంతోపాటు ఒకేసారి మూడు నెలల రేషన్ ను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
దీంతో రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. కొతనత రేషన్ఘపులతో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రయోజనం చేకూరనుంది.
Read Also : Telangana Gig Workers Bill: గిగ్ వర్కర్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
New ration shops in Telangana
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం
అదే సమయంలో ఎండలు తీవ్రమవుతున్న క్రమంలో ఒకేసారి మూడు నెలల రేషన్ను లబ్దిదారులకు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏప్రిల్లోనే మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ ను ఏప్రిల్ నెలలో ఒకేసారి అందిస్తారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రేషన్ షాపులకు పీడీఎస్ బియ్యం సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఒకేసారి మూడు నెలల రేషన్ అందజేత
ప్రస్తుతం రేషన్ కార్డులోని ప్రతీ సభ్యుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేస్తున్నందున 18 కిలోల చొప్పున అందించాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్లో మార్పులు ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే 72 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఐదుగురు సభ్యులు ఉంటే 90 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంత్యోదయ కార్డు కలిగి ఉన్నవారికి నెలకు 35 కిలోల చొప్పున అందిసారు. అంటే మూడు నెలలకు 105 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
అయితే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల లబ్దిదారులు సమీపంలోని రేషన్ షాపుల్లో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు. ఒకేసారి మూడు నెలల బియ్యం అందిస్తుండటంతో బయోమెట్రిక్ మెషిన్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. ఒకేసారి మూడు నెలల వేలిముద్ర వేసేలా మెషిన్లలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే మూడు నెలల స్టాక్ అందుబాటులో ఉంచేందుకు రేషన్ దుకాణాల్లో స్థలం సరిపోడం లేదు. దీంతో డిమాండ్ కనుగుణంగా డీలర్లకు సరఫరా చేయలని పౌర సరఫరాలశాఖ అధికారులు సన్నద్దమ వుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

