Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

వార్త 1 week ago

కులం పేరుతో దూషించినందుకు పదకొండేళ్లు జైలుశిక్ష

Nalgonda SC ST Court Verdict: తప్పు చేస్తే కాలం వెంటాడు తుందనడానికి నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు నిదర్శ నంగా నిలుస్తుందని నిరూపిస్తూ 13 ఏళ్ల క్రితం నాటి ఓ అమానుష ఘటనపై నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ మంగళవారం సంచలన తీర్పునిచ్చింది.

ప్రేమ పేరుతో వంచించి కులం పేరుతో దూషించిన నిందితులకు కోర్టు కఠినకారాగార శిక్షలను ఖరారు చేసింది.

Read Also: Co-option Members Election:హుస్నాబాద్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక!

 Sensational verdict of SC and ST court

Nalgonda SC ST Court Verdict: కేసు పూర్వాపరాలు

కోర్టు తీర్పు అనుగుణంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన పూర్వపురాలు ఇలా ఉన్నాయి. 2013లో చందంపేట మండలం గన్నేరులపల్లికి చెందిన నక్క పర్వతాలు దిండి మండలం చెందిన యువతీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. తీరా బాధితురాలు పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి పర్వతాలు మరియు అతని అత్త నీలం సత్తమ్మ కలిసి ఆమె కులాన్ని కించపరుస్తూ తీవ్రంగా దూషించి పెళ్లికి నిరాకరించారు.

నిందితులకు కఠిన శిక్షలు

సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితులకు భారీ శిక్షలను విధించింది. నిందితుడు నక్క పర్వతాలకు వేరువేరు సెక్షన్ల కింద కలిపి మొత్తం 11 ఏళ్లు జైలు శిక్షతోపాటు ఐదు వేల జరిమానా విధించబడింది. అదే సమయంలో నిందితురాలు నీలం సత్తమ్మకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు 3000 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ శిక్షలని ఏకకాలంలో అమలు కానున్నాయి.

అధికారులకు అభినందనలు

ఇదిలా ఉండగా బాధితురాలుకి న్యాయం చేకూర్చడంలో కీలకపాత్ర పోషించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహతో పాటు దర్యాప్తులో అప్పటి ఎస్సై రామాంజనేయులు, మాజీ దేవరకొండ ఎస్ డి పి ఓ మనోహర్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణన్, కానిస్టేబుల్ లింగయ్య బాధితులకు భరోసా ఇచ్చేలా నేరస్థుల్లో వణుకు పుట్టించేలా ఈ తీర్పు ఉంది. సాక్ష్యాధారాలను పకడ్బందీగా సమర్పించిన ప్రతి అధికారికి ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు. ప్రస్తుతం డిండి పోలీస్ స్టేషన్లో బాధ్యతలను ఎస్సై బాలకృష్ణ, సిఐ బీసన్న దేవరకొండ ఎస్ డి పి ఓ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్న వారికి కూడా అభినందనలు తెలిపారు. కాగా కాలం గడిచిన న్యాయం గెలుస్తుందని బలహీన వర్గాలపై వేధింపులకు పాల్పడితే శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భార్య కాళ్లు నరికిన కిరాతక భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha