ఏటీఎంలో సెలూన్ షాప్
Bihar Viral New : బీహార్‌లో ఓ విచిత్ర ఘటన నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఎస్బీఐ ఏటీఎంగా పనిచేసిన చోట ఇప్పుడు సెలూన్ ప్రారంభించడంతో ప్రజలు షాక్ అవుతున్నారు.
బీహార్‌లోని దానాపూర్ ప్రాంతంలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఇప్పుడు హెయిర్‌కట్, షేవింగ్ చేసే సెలూన్‌గా మారిపోయింది. బయట నుంచి చూస్తే అచ్చం ఎస్బీఐ ఏటీఎంలానే కనిపిస్తుండటంతో డబ్బుల కోసం వెళ్లినవారు లోపలికి వెళ్లి ఆశ్చర్యపోతున్నారు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
ఖాళీ అయిన ఏటీఎంలో కొత్త వ్యాపారం
దానాపూర్‌లోని రూపస్‌పూర్ ప్రాంతంలో కొన్నేళ్ల పాటు ఈ కియోస్క్‌లో ఎస్బీఐ ఏటీఎం పనిచేసేది. అయితే కొన్ని నెలల క్రితం బ్యాంకు ఆ ఏటీఎంను తొలగించింది. కానీ బయట ఉన్న ఎస్బీఐ బోర్డు, లోగో, ఏటీఎం గుర్తులను మాత్రం అలాగే వదిలేశారు.
తర్వాత ఆ ఖాళీ స్థలాన్ని ఓ వ్యక్తి అద్దెకు తీసుకుని అక్కడ సెలూన్ ప్రారంభించాడు. బయట ఇంకా ఏటీఎం బోర్డు ఉండటంతో చాలామంది డబ్బులు తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఏటీఎం మెషీన్ బదులుగా కుర్చీలు, అద్దాలు, హెయిర్ కటింగ్ పరికరాలు కనిపించడంతో అవాక్కవుతున్నారు.
Read Also:Tamilnadu Politics : DMKపై కాంగ్రెస్ ఆగ్రహం !
వైరల్ వీడియోపై స్పందించిన అధికారులు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. దీనిపై (Bihar Viral New) స్పందించిన అధికారులు వెంటనే అక్కడి నుంచి ఎస్బీఐ బోర్డు, లోగోలను తొలగించారు. ఈ 'సెలూన్ ఏటీఎం'పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లి హెయిర్‌కట్ చేయించుకుని వస్తున్నారు" అంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు. మరికొందరు దీన్ని భారతీయ 'జుగాడ్'కు ఉదాహరణగా అభివర్ణించారు. పాత బోర్డులు అలాగే ఉంచి కొత్త వ్యాపారాలు చేయడం భారత్‌లో సాధారణమే అంటూ మరికొందరు చమత్కరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

