Air India Refund: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సంస్థ కీలక శుభవార్త చెప్పింది. టికెట్ రద్దు లేదా ఇతర కారణాలతో రిఫండ్ పొందేందుకు గతంలో ఎక్కువ సమయం పట్టేది.
అయితే ఇప్పుడు ఆ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. గతంలో రిఫండ్ మొత్తం ప్రయాణికుల ఖాతాల్లో జమ కావడానికి 14 రోజుల వరకు సమయం పట్టేది. ప్రస్తుతం ఈ వ్యవధిని కేవలం 4 గంటలకు తగ్గించినట్లు సంస్థ తెలిపింది.
Read Also :Bank Strike: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్

ఏఐ ఏజెంట్లతో వేగంగా రిఫండ్
రిఫండ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు AI ఏజెంట్లను వినియోగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. సాంకేతికత ఆధారిత విధానాలతో ప్రయాణికులకు రిఫండ్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Air India Refund: కస్టమర్ సర్వీసుల్లోనూ మార్పులు
రిఫండ్ సేవలకే పరిమితం కాకుండా కస్టమర్ సర్వీసులను కూడా మరింత మెరుగుపరచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ప్రయాణికుల సమస్యలకు వేగంగా స్పందించడం, సేవలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. రిఫండ్ సమయం 14 రోజుల నుంచి 4 గంటలకు తగ్గడం వల్ల టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు మరింత త్వరగా డబ్బు అందుబాటులోకి రానుంది.
ట్రంప్ సర్కార్‌కు షాక్: వీసాల నిబంధనలపై అమెరికా కోర్టు స్టే

