Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్‌ సర్కార్‌కు షాక్: వీసాల నిబంధనలపై అమెరికా కోర్టు స్టే

ట్రంప్‌ సర్కార్‌కు షాక్: వీసాల నిబంధనలపై అమెరికా కోర్టు స్టే

వార్త 2 weeks ago

US New Visa Rules For Students : విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, జర్నలిస్టుల వీసాల వ్యవధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనలకు ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది.

నిబంధనలు అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు మసాచుసెట్స్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్‌ సేలర్‌ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల అమెరికాలోని వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు ఇతర విదేశీ విద్యార్థులకు తాత్కాలికంగా పెద్ద ఊరట లభించింది. గత జులైలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం వీసా నిబంధనల్లో మార్పులను ఖరారు చేసింది: విద్యార్థులు (F1) మరియు ఎక్స్ఛేంజ్‌ విజిటర్లకు (J1) గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి విధించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం విద్యార్థి కోర్సు పూర్తయ్యేంత వరకు చట్టబద్ధంగా అమెరికాలోనే ఉండవచ్చు. ఈ విధానాన్ని తొలగించాలని భావించారు. I-వీసాలపై వచ్చే విదేశీ జర్నలిస్టులకు సాధారణంగా 240 రోజులు, చైనా జర్నలిస్టులకు కేవలం 90 రోజుల పరిమితి విధించాలని ప్రతిపాదించారు.

BRICS Summit 2026: BRICS సమ్మిట్ రెండో రోజు.. షెడ్యూల్ ఇదే

 US New Visa Rules For Students

US New Visa Rules For Students : కోర్టు ఆక్షేపణలు – విశ్వవిద్యాలయాల వాదనలు

ఈ ప్రతిపాదనలపై అమెరికాలోని దాదాపు 600 ఉన్నత విద్యాసంస్థలు, కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాయి. పీహెచ్‌డీ (PhD) లాంటి కోర్సులు పూర్తి చేయడానికి కనీసం ఆరేళ్లు పడుతుందని, నాలుగేళ్ల పరిమితి పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు అలన్ ఎం. గార్బర్ గుర్తుచేశారు. ప్రభుత్వం సరైన అధ్యయనం లేకుండా దశాబ్దాల నాటి విధానాన్ని మార్చాలని చూస్తోందని కోర్టు పేర్కొంది. ఈ నిబంధనల వల్ల విదేశీ విద్యార్థుల ప్రవేశాలు తగ్గి, ఉన్నత విద్యారంగానికి విపత్తు స్థాయి నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది. జర్నలిస్టుల వీసా పొడిగింపును తిరస్కరిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోవడం సరికాదని, ప్రభుత్వాన్ని విమర్శించే విలేకరులపై నియంత్రణ సాధించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. వీసా మోసాలు, గడువు ముగిసినా ఉండిపోయే వారిని గుర్తించడానికే ఈ మార్పులు తెచ్చామని ట్రంప్ ప్రభుత్వం వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ప్రస్తుతం లభించిన ప్రాథమిక స్టే తాత్కాలిక ఊరట మాత్రమే కాగా, ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగనుంది. అంతవరకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయి.

అంతరిక్షంలో ఆయుధాలు.. తొలిసారి బయటపెట్టిన అమెరికా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha