Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం: ఆ 6 దేశాలకు విమానాలు బంద్!

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం: ఆ 6 దేశాలకు విమానాలు బంద్!

వార్త 1 week ago

Air India flight : ఎయిర్ ఇండియా సంస్థ అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విమాన సర్వీసులను భారీగా తగ్గించడంతో పాటు కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరగడం మరియు గగనతల ఆంక్షలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని సంస్థ వెల్లడించింది.

నిలిచిపోయిన 6 ప్రధాన అంతర్జాతీయ రూట్లు

ఆర్థిక భారానికి తోడు వాణిజ్యపరంగా లాభదాయకంగా లేని కారణంగా 6 ప్రధాన మార్గాల్లో సేవలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా మరియు ఢిల్లీ-మాలే రూట్లు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఆగస్టు నెల వరకు విమాన సేవలు అందుబాటులో ఉండవని ఎయిర్ లైన్ స్పష్టం చేసింది.

Read Also:Kalyandurgam MLA : మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే సురేంద్ర బాబు

 Air India flight

కొనసాగనున్న కీలక విదేశీ సర్వీసులు

కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గించినప్పటికీ, నెలకు 1,200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతామని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఉత్తర అమెరికాకు వారానికి 33, యూరప్‌కు 47, యూకేకు 57 విమానాలు నడుస్తాయి. అలాగే ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా దేశాలకు నిర్ణీత సంఖ్యలో సర్వీసులను కొనసాగించనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha