Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుల గణనలో బిసిలకు అన్యాయం

కుల గణనలో బిసిలకు అన్యాయం

వార్త 4 months ago

కులగణనలో బిసిలకు తీవ్ర అన్యాయం జరుగబోతున్నదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి.హను మంతరావు(Hanumantha Rao) అన్నారు. శుక్రవారం అంబర్పేటలోని తన నివాసంలో విహెచ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎస్సీ ఎస్టీలతోపాటు ఓబీసీల వివ రాలు సేకరించాలని డిమాండ్ చేశారు. ‘కులగణనలో ఎస్సీ, ఎస్టీల కులాల వివరాలు మాత్రమే తీసుకుంటారా?మా ఓబీసీల వివరాలు తీసుకోరా.. ఓబీసీలు అంటే పట్టదా మీకు.. ఓబీసీలు కూడా బిలోఫ్రావర్టీలో ఉన్నారు. వారి వివరాలు కూడా సేకరించాలి.

Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం

 Hanumantha Rao: Injustice to BCs in caste census

ఓబీసీల వివరాలు కూడా సేకరించాలి

కులగణనతో ఎవరికి లాభం.. జనాభా వివరాలు సేకరించే లిస్ట్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీల వివరాలు కూడా సేకరించాలి’ అని డిమాండ్ చేశారు. ‘రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెచ్చాం. బిసి రిజర్వేషన్ల కోసం సిఎం రేవంత్రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశారు. బిసి రిజర్వేషన్ కోసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. ఇబిసిలకు 10శాతం రిజర్వేషన్లు ఇస్తే తాము వ్యతిరేకించ లేదు. మాకు రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టుకెళ్లి స్టేతీసుకొని వచ్చారు.

Hanumantha Rao: భవిష్యత్ తరాలకు అన్యాయం

నేడు కులగణనలో కూడా తీవ్ర అన్యాయం. ‘ఇప్పుడు మనం మేల్కొనకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారం అవుతాం. మోడీ రిమోట్ కంట్రోల్ అంతా మోహన్భగవత్ దగ్గర ఉన్నది. ఓట్లు వేయడానికి ఉదయమే లైన్లో నిలబడేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనా ర్టీలే ముందు వరుసలో ఉంటారు. మన ఓట్లు వాళ్లకు కావాలి.. మన ఓబీసీ లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి వద్దా. ఇప్పుడు యుద్ధం చేయక పోతే.. భవిష్య త్తులో బీసీల భవిష్యత్తు అంధకా రమే. జనంలోకి పోవాలి. బీసీలకు జరు గుతున్న అన్యాయాన్ని వివరించాలి. కేంద్ర కులగణన అనేది బోగస్. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని బిసి సంఘాల నాయకులతో, మేధావులతో మాట్లాడి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని వి.హనుమంతరావు ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కానిస్టేబుళ్లకు సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలి: జగ్గారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha