Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీజులపై ఉన్న శ్రద్ధ వసతులపై ఏదీ?.. ప్రైవేట్ కాలేజీలపై విజయశాంతి ఫైర్

ఫీజులపై ఉన్న శ్రద్ధ వసతులపై ఏదీ?.. ప్రైవేట్ కాలేజీలపై విజయశాంతి ఫైర్

వార్త 1 week ago

MLC Vijayashanthi:తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా, కనీస మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు పాటించకపోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ఫీజుల వసూళ్లపైనే దృష్టి పెడుతున్న యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తూ శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Read Also: TG IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

 Why isn’t there the same focus on facilities as there is on fees? Vijayashanti lashes out at private colleges.

MLC Vijayashanthi: నాణ్యతతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను ప్రైవేట్ కళాశాలల్లో విద్యా నాణ్యత, కనీస ప్రమాణాల అమలుతో ముడిపెట్టాలని విజయశాంతి ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ఫీజు బకాయిల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను ఆమె స్వాగతించారు. అయితే, ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్ నిధులు, విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ఫీజులపై ఉన్న శ్రద్ధ.. యాజమాన్యాలకు నాణ్యమైన విద్యను అందించడంలో లేదని ఆమె మండిపడ్డారు. “విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే హక్కు ప్రైవేట్ యాజమాన్యాలకు ఎంతైతే ఉందో, వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యతను కూడా వారు విధిగా నెరవేర్చాలి” అని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయని గతంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికను విజయశాంతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే ప్రధాన అంశాన్ని తాను గతంలో శాసనమండలిలోనూ ప్రస్తావించినట్లు ఆమె వెల్లడించారు. ప్రజాధనంతో ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్‌మెంట్ నిధులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నిజమైన ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠినంగా వ్యవహరించాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

సుచరిత ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ₹50 కోట్ల అక్రమాస్తులు సీజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha