Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్లైఓవర్‌పై వాహనంలో అకస్మాత్తుగా మంటలు

ఫ్లైఓవర్‌పై వాహనంలో అకస్మాత్తుగా మంటలు

వార్త 2 months ago

Kavulepalli Flyover Accident: సత్యసాయి జిల్లా లోని కవులేపల్లి ఫ్లైఓవర్‌పై శనివారం ఒక పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం సృష్టించింది.

Read Also:Overdose medicines : పెళ్లికి ముందు విషాదం.. యువకుడి మృతి మిస్టరీ

 Vehicle suddenly catches fire on flyover

అప్రమత్తతతో తప్పిన ముప్పు

ఫ్లైఓవర్‌పై వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాహనం ఆపి అందరూ కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రాణాపాయం తప్పింది.

Kavulepalli Flyover Accident: పూర్తిగా దగ్ధమైన వాహనం

మంటలు వేగంగా వ్యాపించడంతో టాటా ఏస్ వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్‌పై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

బాన్సువాడలో విషాదం: ఇడ్లీ ఇరుక్కుని బాలింత మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha